ప్రతిభకు పేదరికం అడ్డం కాదు.. పేదింటి విద్యార్థికి రూ.2.5కోట్ల స్కాలర్​షిప్​..

Student Scholarship: బిహార్​ రాజధాని పట్నాకు చెందిన 17 ఏళ్ల నిరుపేద విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు.

Update: 2022-07-09 02:10 GMT

ప్రతిభకు పేదరికం అడ్డం కాదు.. పేదింటి విద్యార్థికి రూ.2.5కోట్ల స్కాలర్​షిప్​..

Student Scholarship: బిహార్​ రాజధాని పట్నాకు చెందిన 17 ఏళ్ల నిరుపేద విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక లఫాయెట్టే కళాశాలలో ఉన్నత విద్య చదువుకోవడానికి రూ.2.5కోట్ల విలువైన స్కాలర్​షిప్​ను పొందాడు. ఈ మేరకు ప్రేమ్​ కుమార్​కు అంగీకార పత్రాన్ని పంపించింది కళాశాల యాజమాన్యం. "వెనుకబడిన వర్గాలకు సేవ చేయాలనే మీ నిబద్ధత, పట్టుదలను చూసి మేము ప్రేరణ పొందాము." అంటూ కళాశాల డీన్​ మాథ్యూ హైడ్​ అభినందన లేఖను పంపించారు.

1826లో స్థాపించిన లాఫయెట్టే అమెరికాలోని అత్యున్నత 25 కళాశాలల్లో ఒకటి. భారత దేశంలో ఇలాంటి ప్రతిష్టాత్మక కళాశాలలో సీటు సంపాందించిన మొదటి దళితుడు ప్రేమ్​ కుమార్. తన కుటుంబంలో కాలేజీకి వెళ్లిన మొదటి వ్యక్తి ప్రేమ్. ప్రస్తుతం శోషిత్ సమాధాన కేంద్రంలో 12వ తరగతి చదువుతున్నాడు. యూఎస్‌లో ప్రేమ్ మెకానికల్ ఇంజినీరింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై నాలుగేళ్లపాటు చదువుకుంటాడు. ఈ స్కాలర్‌షిప్ లో విద్య, చదువుకునే సమయంలో కావాల్సిన సదుపాయాలు, ప్రయాణించడానికి అయ్యే మొత్తం ఖర్చు, ట్యూషన్ ఫీజులు, ఆరోగ్య బీమా కవర్ చేయబడతాయి.

Tags:    

Similar News