CRPF: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పది పాసైతే చాలు..

Government Jobs 2023: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Update: 2023-04-07 07:40 GMT

CRPF: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పది పాసైతే చాలు..

Government Jobs 2023: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మొత్తం లక్ష30 వేల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రక్షణ దళాల్లో ఒకటైన సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా ప్రకటించింది. CRPFలో మొత్తం 1,29,929 కానిస్టేబుల్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటిలో 1,25,262 పురుష అభ్యర్థులకు, 4667 మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.

కానిస్టేబుల్ పోస్టుల్లో రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం ఖాళీలు ఎక్స్-అగ్నివీర్లకు కేటాయిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in లో అప్లై చేసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్ నుంచి అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పోస్టులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉంటుంది. ఇక వేతనాల విషయానికొస్తే.. రూ. 21,700- 69,100 మధ్య ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ తేదీలు ఇంకా ప్రకటించలేదు. హోం మంత్రిత్వ శాఖ అధికారిక వివరణాత్మక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సీఆర్‌పీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు.


Tags:    

Similar News