నిరుద్యోగులకి అలర్ట్‌.. 9000 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది..!

CRPF Recruitment 2023: పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనే యువతకి ఇది శుభవార్తనే చెప్పాలి.

Update: 2023-03-28 13:03 GMT

నిరుద్యోగులకి అలర్ట్‌.. 9000 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది..!

CRPF Recruitment 2023: పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనే యువతకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ (CRPF ) రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ నుంచి 9,212 కానిస్టేబుల్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం మార్చి 27 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు CRPF అధికారిక వెబ్‌సైట్ crpf.gov.inని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక 2023 జూలై 1 నుంచి 13 వరకు జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డును జూన్ 20న జారీ చేస్తారు. అభ్యర్థులు జూన్ 25 నుంచి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 9,212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో 9,105 పురుష అభ్యర్థులను, 107 పోస్టుల్లో మహిళలను నియమించనున్నారు. దరఖాస్తు చేసుకునే ముందు ఒక్కసారి అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవాలని అధికారులు సూచించారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ crpf.gov.inని సందర్శించాలి.

2. హోమ్‌పేజీలో కిందికి స్క్రోల్ చేసి ఆపై రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

4. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి ఫారమ్‌ను తనిఖీ చేయాలి.

5. తర్వాత సమర్పించి భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

దరఖాస్తు రుసుము ఎంత?

జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.

Tags:    

Similar News