CRPF Constable GD Recruitment 2024: స్పోర్ట్స్ కోటా కింద సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!
CRPF Constable GD Recruitment 2024: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ Cలో 169 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
CRPF Constable GD Recruitment 2024: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ Cలో 169 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ ప్రక్రియ జనవరి 16 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్ణయించారు. అధికారిక వెబ్‌సైట్ rect.crpf.gov.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
స్పోర్ట్స్ కోటా కింద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో గ్రూప్ "సి"లోని కానిస్టేబుల్ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 169 ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 15 ఫిబ్రవరి 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ, ఇతర వెనుకబడిన తరగతి, EWS కేటగిరీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
క్రీడా విభాగాలు: జిమ్నాస్టిక్, జూడో, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, తైక్వాండో, వాటర్ స్పోర్ట్స్ కయాక్, కానో, రోయింగ్, బాడీబిల్డింగ్, వెయిట్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రయత్లాన్, డైవింగ్, డైవింగ్ ఈక్వెస్ట్రియన్, యాచింగ్, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కీయింగ్ క్రీడల్లో పాల్గొనే అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు.క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.