CISF Recruitment 2023: CISFలో ఉద్యోగాలు.. పది, ఇంటర్ చదివిన వారు అర్హులు..!
CISF Recruitment 2023: పది, ఇంటర్ చదివిన నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి మంచి అవకాశం వచ్చింది.
CISF Recruitment 2023: పది, ఇంటర్ చదివిన నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి మంచి అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హ్యాట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cisfrectt.cisf.gov.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ చేసేటప్పుడు అవసరమైన అన్ని పత్రాలను సేకరించండి. తద్వారా ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉంటారు. అభ్యర్థులు 28 నవంబర్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీ ద్వారా మొత్తం 215 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత, వయో పరిమితి
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు, అథ్లెటిక్స్‌లో ప్రాతినిధ్యం వహించాలి. విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి. వయోపరిమితి గురించి మాట్లాడినట్లయితే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 23 సంవత్సరాలుగా నిర్ణయించారు. జీతం ప్రతి నెలా లెవెల్ 4 (రూ. 25,500 నుంచి రూ. 81,100) వరకు ఉంటుంది.
భౌతిక పరీక్ష
ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులు మొదట ట్రయల్, ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంటేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా వెళుతారు. CISF రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అన్ని దశల రిక్రూట్‌మెంట్ కాల్-అప్ లెటర్, అడ్మిట్ కార్డ్ విడుదల అవుతాయి. అలాగే అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడినట్లయితే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి.
ఇలా దరఖాస్తు చేసుకోండి
1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ cisfrectt.cisf.gov.inని సందర్శించాలి.
2. వెబ్‌సైట్‌లో అప్లై చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను చదవాలి.
3. దరఖాస్తు, సంతకం, ఫొటో, ఐడి ప్రూఫ్‌కు సంబంధించిన అన్ని అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
4. అప్పుడు దరఖాస్తు రుసుము చెల్లించాలి.
5. తర్వాత దరఖాస్తు ఫారమ్ సమర్పించిన ప్రింట్ అవుట్ తీసుకోవాలి.