ఆడపిల్లలకు ఈ స్కీమ్‌ ఒక వరం.. టెక్నికల్‌ కోర్సులు చేయడానికి ఉచిత సాయం..!

CBSE Udaan Scheme: ఆడపిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నాయి.

Update: 2024-01-08 15:30 GMT

ఆడపిల్లలకు ఈ స్కీమ్‌ ఒక వరం.. టెక్నికల్‌ కోర్సులు చేయడానికి ఉచిత సాయం..!

CBSE Udaan Scheme: ఆడపిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నాయి. ఎందుకంటే దేశంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య వివక్ష ఇంకా కొనసాగుతోంది. దీనిని రూపుమాపడానికి ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని పథకాలను తీసుకువస్తోంది. దీనివల్ల పేద కుటుంబాలకు చెందిన బాలికలకు సాయం చేయవచ్చు. అందులో ఒకటి CBSE ఉడాన్ పథకం. ఈ పథకం అమ్మాయిలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

నేటికీ ఇంజినీరింగ్, టెక్నికల్ రంగాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వం CBSE Udaan పథకం కింద ఈ అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఈ స్కీమ్‌ కింద ఇంజినీరింగ్, టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో బాలికల నమోదును ప్రోత్సహిస్తున్నారు. వేల మంది బాలికలకు ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేరేందుకు ఉచితంగా సాయం అందిస్తారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వారికి స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచారు. ఇందులో వీడియోల ద్వారా అధ్యయనాలు బోధిస్తారు. అలాగే ఈ పథకం కింద భారతదేశంలోని 60 కేంద్రాల్లో వర్చువల్ తరగతులు నిర్వహిస్తారు. ఇందులో ఆడపిల్లలకు ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి ఆర్థిక సాయం అందజేస్తారు. అధ్యయన సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తారు.

ఏది చెయ్యవచ్చు?

ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి బాలికలు నవోదయ పాఠశాల, సెంట్రల్ స్కూల్ లేదా రాష్ట్ర, కేంద్రంలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాల లేదా CBSEకి అనుబంధంగా ఉన్న ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదివి ఉండాలి. దీంతో పాటు 10వ తరగతిలో కనీసం 70 శాతం మార్కులు, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 80 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు అమ్మాయి కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

CBSE ఉడాన్ పథకం ప్రయోజనాలను పొందేందుకు మీరు CBSE అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. అన్ని నియమాలను జాగ్రత్తగా చదివిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. తర్వాత పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ నంబర్‌ను చూస్తారు. ఇది మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌కు వస్తుంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఆధార్ కార్డు, అసలు చిరునామా రుజువు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం, 10వ, 11వ తరగతి మార్క్‌షీట్‌లు, అవసరమైతే బ్యాంకు ఖాతా వివరాలను కలిగి ఉండాలి.

Tags:    

Similar News