పది, ఐటీఐ విద్యార్థులకి గుడ్‌న్యూస్.. ఎంపికైతే 81000 వరకు జీతం..!
BSF Recruitment 2022: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతకు ఇది మంచి అవకాశం.
BSF Recruitment 2022: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతకు ఇది మంచి అవకాశం. బీఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు బీఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ bsf.gov.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19గా నిర్ణయించారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 1312 పోస్టులు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 20 ఆగస్టు
దరఖాస్తుకు చివరి తేదీ - 19 సెప్టెంబర్
మొత్తం పోస్టుల సంఖ్య- 1312
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 982 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 330 పోస్టులు
అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెండేళ్ల పారిశ్రామిక శిక్షణా సంస్థ (ITI), రేడియో, టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డేటా ప్రిపరేషన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్ లేదా డేటా కలిగి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 19 సెప్టెంబర్ 2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకి జీతం రూ.25500 నుంచి రూ.81100 వరకు చెల్లిస్తారు.