Career In Aviation: పైలెట్‌ అవ్వండి లక్షల జీతం పొందండి.. ఏవియేషన్‌ రంగంలో కెరియర్‌..!

Career In Aviation: కొంతమంది స్టూడెంట్స్‌ అందిరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఆలోచిస్తారు.

Update: 2024-03-15 08:30 GMT

Career In Aviation:పైలెట్‌ అవ్వండి లక్షల జీతం పొందండి.. ఏవియేషన్‌ రంగంలో కెరియర్‌..!

Career In Aviation: కొంతమంది స్టూడెంట్స్‌ అందిరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఆలోచిస్తారు. అందుకే కెరియర్‌ను కొత్తగా ప్లాన్‌ చేస్తారు. అలాంటి వారు ఇంటర్‌ తర్వాత ఏవియేషన్‌ రంగాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో కెరియర్‌ చేస్తే లక్షల జీతంతో పాటు లగ్జరీ లైఫ్‌ను పొందవచ్చు. పైలట్‌గా మారి ఆకాశంలో ఎగరవచ్చు. దీనిపై అవగాహన లేకపోవడం వల్ల తక్కువ మంది మాత్రమే ఏవియేషన్‌ రంగంలో వస్తున్నారు. అయితే పైలెట్‌గా ఎలా మారాలి.. ఎలాంటి సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి తదితర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కావాల్సిన అర్హత

ఈ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత ఏదైనా ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంట్రన్స్‌ పరీక్ష, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాలి. వీటన్నిటిని క్లియర్ చేసిన తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందుతారు. ఇక్కడ మీకు విమానానికి సంబంధించిన చిక్కులను నేర్పించడంతో పైలెట్‌ శిక్షణ ఇస్తారు.

ఎయిర్‌ఫోర్స్‌లో చేరే అవకాశం

మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావాలనుకుంటే ఇంటర్‌ తర్వాత UPSC, NDA పరీక్ష, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT), NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా ఉద్యోగం పొందడానికి మీరు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షను రాయవచ్చు.

వాణిజ్య పైలట్

ఇంటర్‌ తర్వాత ఏవియేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది కమర్షియల్‌ పైలట్‌ కూడా కావచ్చు. శిక్షణ పూర్తయిన తర్వాత మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కోసం ఫిట్‌నెస్ పరీక్ష, రాత పరీక్ష రాయాలి. తరువాత విజయవంతమైన అభ్యర్థులు తమ వృత్తిని వాణిజ్య పైలట్‌గా ప్రారంభించవచ్చు.

జీతం ఎంత వస్తుంది

సమాచారం ప్రకారం ఎయిర్ ఫోర్స్ అధికారి జీతం రూ. 56,100 నుంచి మొదలవుతుంది. అయితే కమర్షియల్ పైలట్‌గా మీరు రూ. 1 లక్ష వరకు సంపాదించవచ్చు. అనుభవంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.

Tags:    

Similar News