ఆర్మీ అభ్యర్థులకి బ్యాడ్‌ న్యూస్‌.. ఇకనుంచి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే..!

Indian Army Jobs 2023: ఆర్మీలో చేరడానికి సిద్ధమవుతున్నారా.. అయితే ఈ వార్తను కచ్చితంగా చదవండి.

Update: 2023-02-28 10:30 GMT

ఆర్మీ అభ్యర్థులకి బ్యాడ్‌ న్యూస్‌.. ఇకనుంచి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే..!

Indian Army Jobs 2023: ఆర్మీలో చేరడానికి సిద్ధమవుతున్నారా.. అయితే ఈ వార్తను కచ్చితంగా చదవండి. గతంలో మీ వయసు పూర్తయే వరకు ఉద్యోగం కోసం పోటీ పడవచ్చు. కానీ ఇప్పుడు నిబంధనలు మార్చారు. కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే అప్లై చేసుకోగలరు. ఈ విషయాన్ని బ్రిగేడియర్ జగదీప్ చౌహాన్ తెలిపారు. ఈ ఏడాది జరగనున్న ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ గురించి ఆయన మాట్లాడారు. రెండు దశల్లో అగ్నివీర్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు.

మీరు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే CEE ర్యాలీ ద్వారా సైన్యంలో ఉద్యోగం పొందాలంటే సంవత్సరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు అప్లై చేసుకోలేరు. ప్రస్తుతం అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 16న నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. joinindianarmy.nic.inని సందర్శించడం వల్ల 15 మార్చి 2023 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు .

అగ్నివీర్ ప్రక్రియ రెండు దశల్లో

మొదటగా సాధారణ ప్రవేశ పరీక్ష ఉంటుంది. తర్వాత అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్మీ ఫిజికల్, మెడికల్ టెస్టులు ఉంటాయి. ఇంతకు ముందు రాత పరీక్ష తర్వాత జరిగేది. ముందుగా అభ్యర్థులకు శారీరక పరీక్ష నిర్వహించేవారు. ఆర్మీ కొత్త రిక్రూట్‌మెంట్ సిస్టమ్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, అడ్మిట్ కార్డ్ జారీ, ఆన్‌లైన్ ఎగ్జామ్, రాత పరీక్ష ఫలితాలు, ఉత్తీర్ణులైన వారికి ర్యాలీ కోసం కాల్ లెటర్‌లు అందిస్తారు.

తర్వాత రెండో దశ ప్రారంభమవుతుంది. ఇందులో అగ్నివీర్ ఫిజికల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ జారీ, అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్, ఫైనల్ మెరిట్ (సెలక్షన్ లిస్ట్) ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News