Government Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బార్క్‌లో 4,374 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం..
BARC Recruitment: బాబా అణు పరిశోధనా కేంద్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన పరిశోధనా కేంద్రం బార్క్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లోని ఈ పోస్టులను ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
BARC Recruitment: బాబా అణు పరిశోధనా కేంద్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన పరిశోధనా కేంద్రం బార్క్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లోని ఈ పోస్టులను ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 22 లోగా దరఖాస్తు చేసుకోవాలని బార్క్ పేర్కొంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
ఈ నోటిఫికేషన్ ద్వారా 4,374 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ స్కీం అంటే స్టైపెండరీ ట్రైనీ కింద మిగిలిన అంటే 4,162 పోస్టులను భర్తీ చేయనున్నారు.
టెక్నికల్ ఆఫీసర్/ సి 181 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్/ బి 7 పోస్టులు, టెక్నీషియన్/ బి 24 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేయనున్నారు. అలాగే ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.56,100 వేతనం, ఎస్‌ఏకు రూ.35,400, టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 వేతనం చెల్లించనున్నారు.
కేటగిరీ-1 1216 పోస్టులు, కేటగిరీ-2 2946 పోస్టులను ట్రైనింగ్ స్కీం అంటే స్టైపెండరీ ట్రైనీ కింద భర్తీ చేయనున్నారు. వీరికి నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000 వరకు వేతనం, కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు వేతనం చెల్లించనున్నారు.
కెమిస్ట్రీ, బయో-సైన్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, ఫిజిక్స్, డ్రిల్లింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, మైనింగ్ విభాగాల వారీగా ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు..
పోస్టులను బట్టి పది నుంచి పన్నెండో తరగతి వరకు, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ విద్యార్హాతగా నిర్ణయించారు.
వయస్సు..
మే 22, 2023 నాటికి అభ్యర్థుల ఏజ్ విభాగాల వారీగా పేర్కొన్నారు. ఇందులో టెక్నికల్ ఆఫీసర్‌కు 18 నుంచి 35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18 నుంచి 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 18 నుంచి 25 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19 నుంచి 24 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు వివరాలు..
కేటగిరీలను బట్టి ఫీజుల్లో మార్పులు ఉన్నాయి. టీవోకు రూ.500లు, ఎస్‌ఏకు రూ.150లు, కేటగిరీ-1 పోస్టులకు రూ.150, టెక్నీషియన్‌కు రూ.100లు, కేటగిరీ-2 పోస్టులకు రూ.100లుగా నిర్ణయించారు. ఇక ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక..
పోస్టులను బట్టి ప్రిలిమినరీ, అడ్వాన్స్‌డ్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే ఇంటర్వ్యూ, ఆ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను తెలుగు రాష్ట్రాల్లోని , విజయవాడ , విశాఖపట్నం, గుంటూరు , అమరావతి, కరీంనగర్ , హైదరాబాద్.
ప్రిలిమినరీ ఎగ్జామ్..
తొలి దశ ఎగ్జామ్‌లో మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మ్యాథ్ నుంచి 20, సైన్స్ నుంచి 20, జనరల్ అవేర్ నెస్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. ప్రతీ కరెక్ట్ ఆన్సర్‌కు 3 మార్కులను కేటాయించారు. అలాగే ప్రతీ రాంగ్ ఆన్సర్‌కు ఓ నెగిటివ్ మార్క్ కేటాయించారు. ప్రిలిమనరీ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌డ్ టెస్టు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్టు నిర్వహిస్తారు.