Axis Bank Jobs 2023: యాక్సిస్ బ్యాంక్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. జీతం, విద్యార్హతలు తెలుసుకోండి..!
Axis Bank Jobs 2023: ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ ఇటీవల డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Axis Bank Jobs 2023: ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ ఇటీవల డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, కేవైసీ వెరిఫికేషన్ ఆఫీసర్, బ్యాంక్ ఆఫీస్ ఎడ్యుకేషనల్ పోస్టులని భర్తీ చేస్తారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరలో ముగియనుంది కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి. ఇందుకోసం ncs.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేది 26 ఆగస్టు 2023 వరకు నిర్ణయించారు. తర్వాత వచ్చిన దరఖాస్తు ఫారమ్‌లని పరిగణలోనికి తీసుకోరు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారుడి కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం వయస్సు 4 ఆగస్టు 2023ని బేస్‌గా పరిగణించి లెక్కిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు కనీస వేతనం రూ.15,200 గరిష్టంగా నెలకు రూ.28,700 జీతం చెల్లిస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి రుసుమును చెల్లించనవసరం లేదు.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియని నేషనల్ కెరీర్ సర్వీస్, లేబర్, ఎంప్లాయ్‌మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా ఉచితంగా నిర్వహిస్తోంది. దరఖాస్తుదారులకు కనీస విద్యార్హత 12వ తరగతి ఉత్తీర్ణత. అలాగే ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం అవసరం. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక్కసారి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.