Assam Rifles Recruitment 2023: పది అర్హతతో పోలీస్ ఉద్యోగాలు.. అస్సాం రైఫిల్స్ నుంచి నోటిఫికేషన్ విడుదల..!
Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ ఆఫీస్ గ్రూప్ బి, సి టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ ఆఫీస్ గ్రూప్ బి, సి టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమై నవంబర్ 19తో ముగుస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ assamrifles.gov.in ద్వారా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి మరింత తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి.
ముఖ్యమైన తేదీలు
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అస్సాం రైఫిల్స్ 161 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేయనుంది. 10 అక్టోబర్ 2023 న నోటిఫికేషన్ విడుదల చేసింది. రాతపరీక్ష/ PST/ PT/ 18 డిసెంబర్ 2023 నుంచి నిర్వహిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్తో పాటు సంబంధిత రంగంలో ఐటీఐ డిప్లొమా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయస్సు జనవరి 01, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది. పోస్టుల వారీ అర్హత ప్రమాణాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ PDFని చూడండి.
ఆన్లైన్లో అప్లికేషన్ విధానం
1. అభ్యర్థులు ముందుగా అస్సాం రైఫిల్స్ అధికారిక వెబ్సైట్ www.assamrifles.gov.in కి వెళ్లాలి.
2. తర్వాత రిక్రూట్మెంట్ ఆప్షన్ కింద 'జాయిన్ అస్సాం రైఫిల్స్ సెక్షన్' లింక్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు స్క్రీన్‌పై న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో “అస్సాం రైఫిల్స్ టెక్నికల్ మరియు ట్రేడ్స్‌మెన్ 2023”ని ఎంచుకోవాలి.
4. ఇప్పుడు పేరు నమోదు చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
5. దరఖాస్తు రుసుము చెల్లించి సమర్పించండి.
6. తర్వాత ఫారమ్‌ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.