అస్సాం రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, బీఎస్ఎఫ్‌లో 84,000 ఖాళీలు.. భర్తీ ఎప్పుడంటే..?
Govt Jobs: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) కింద 84,405 పోస్టులను భర్తీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
Govt Jobs: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) కింద 84,405 పోస్టులను భర్తీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అస్సాం రైఫిల్స్, BSF (సరిహద్దు భద్రతా దళం), CISF (సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్), CRPF(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్), ITBP (ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్), సశాస్త్ర సీమా బాల్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను డిసెంబర్ 2023 నాటికి భర్తీ చేయాలని నిర్ణయించారు. నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి.
అస్సాం రైఫిల్స్‌లో 9659, బీఎస్‌ఎఫ్‌లో 19254, సీఐఎస్‌ఎఫ్‌లో 10918, సీఆర్‌పీఎఫ్‌లో 29985, ఐటీబీపీలో 3187, ఎస్‌ఎస్‌బీలో 11402 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)ఏటా జిడి కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ పోస్టులని భర్తీ చేస్తారు. అలాగే అన్ని సాయుధ బలగాలు ఈ పోస్టుల భర్తీన తొందరగా చేపట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరాయి.
అలాగే భారత సైన్యంలో మొదటి దశలో 25,000 మంది అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ కోసం ఆగస్టు రెండో వారంలో దేశవ్యాప్తంగా 80 ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 16న జరిగే రాత పరీక్షకు హాజరవుతారు. డిసెంబర్‌లో ఎంపికైన 25 వేల మంది అగ్నివీరులు శిక్షణకు వెళుతారు. ఇటీవల అగ్నిపథ్ పై పలు సంఘటనలు జరిగిన సంగతి అందరికి తెలిసిందే.