Competitive Exams: కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే సులువుగా విజయం..!

Competitive Exams: ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి నిరుద్యోగులు రోజుల తరబడి కష్టపడుతారు.

Update: 2023-09-16 11:27 GMT

Competitive Exams: కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే సులువుగా విజయం..!

Competitive Exams: ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి నిరుద్యోగులు రోజుల తరబడి కష్టపడుతారు. సిలబస్‌ మొత్తం కంప్లీట్‌ చేయాలని తిండి తిప్పలు మానేసి చదువుతారు. అయినప్పటికీ కొన్నిసార్లు విజయం వరించకపోవచ్చు. ఎందుకంటే హార్డ్‌వర్క్‌ కంటే స్మార్ట్‌వర్క్‌ గొప్పది. అందుకే చదివేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా జనరల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్ట్‌ అనంతం. దీనిని పూర్తి చేయాలంటే చాలా కష్టం. కానీ కొన్ని ట్రిక్స్‌ ప్లే చేసి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పవచ్చు. అలాంటి చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మైండ్ ప్యాలెస్ టెక్నిక్

మీరు చదివిన వాటిని చాలా రోజుల వరకు గుర్తుంచుకోవడానికి జీవితంలోని విషయాలతో కనెక్ట్ చేసుకోవాలి. ఒక అంశాన్ని మరో అంశానికి ముడిపెట్టి చదవడం వల్ల ఆ విషయం చాలా రోజులు గుర్తుంటుంది.

ఇతరులకు నేర్పించండి

మీరు చదివిన వాటిని మీకు లేదా మీ తోబుట్టువులకు లేదా స్నేహితులకు వివరించడానికి ప్రయత్నించండి. లేదంటే అద్దం ముందు మీకు మీరే ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల కాన్సెప్ట్‌ను బాగా అర్థం చేసుకుంటారు. ఇందులో నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సులభంగా సమాధానం గుర్తిస్తారు.

వార్తాపత్రికలు చదవండి

కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అయ్యేవాళ్లు ప్రతిరోజు వార్తాపత్రిక చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇవన్నీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. అవసరం అనుకుంటే మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో కూడా చదవవచ్చు. వార్తాపత్రికకు కొంత సమయం కేటాయించాలి. దేశ, విదేశాలలో జరిగే ముఖ్యమైన వార్తలు, కరెంట్ అఫైర్స్‌పై పట్టు పెంచుకోవాలి.

రేడియో వినడం

రేడియో వింటూ ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. రేడియోలో జికెకి సంబంధించిన అనేక పోటీ కార్యక్రమాలు వస్తుంటాయి. ప్రయాణంలో, ఇంటి పని చేస్తున్నప్పుడు, ఆఫీసు పనిలో, స్కూల్‌కు, లేదా కోచింగ్‌కు వెళ్లేటప్పుడు రేడియోను వినవచ్చు.

యూట్యూబ్ ఛానెల్‌లు చూడటం

ఈ రోజుల్లో యూట్యూబ్‌లో GKని బోధించే అనేక ఛానెల్‌లు ఉన్నాయి. వీటి ద్వారా జనరల్‌ నాలెడ్జ్‌ని విపరీతంగా పెంచుకోవచ్చు. అలాగే మొబైల్ ఫోన్‌లోని జీకే యాప్‌ల ద్వారా అధ్యయనం చేయవచ్చు.

జీకే పుస్తకాలు చదవండి

పుస్తకాలు చదవడం చాలా మంచి అలవాటు. మీకు కావలసినప్పుడు పుస్తకాలు చదవడం వల్ల జీకే నాలెడ్జ్‌ని పెంచుకోవచ్చు. మార్కెట్‌లో చాలా మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, వాటి సహాయంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు.

Tags:    

Similar News