APMSRB Recruitment 2023: ఏపీ నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్..!
APMSRB Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే ఏపీ నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి.
APMSRB Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే ఏపీ నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (dme.ap.nic.in) ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 26 జూలై 2023గా నిర్ణయించారు. తక్కువ రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం ఉత్తమం. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 590 ఖాళీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులని భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల వయస్సు జూలై 14, 2023 నాటికి 42 ఏళ్లు మించకూడదు. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ని ఒకసారి చదవండి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగాల్లో సైన్స్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక పౌరులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1,000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్dme.ap.nic.in కి వెళ్లాలి. ఇ మెయిల్ ఐడిని ఉపయోగించి పేరు నమోదు చేసుకొని లాగిన్ అవ్వాలి. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత పరీక్ష ఫీజు చెల్లించాలి. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తదుపరి ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.