AP SSC Results 2023: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ డేట్ వచ్చేసింది.. బీ రెడీ...
AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలపై అప్ డేట్ వచ్చేసింది.
AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలపై అప్ డేట్ వచ్చేసింది. టెన్త్ ఫలితాల కోసం దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెర దించేస్తూ SSC బోర్డు టెన్త్ ఫలితాలపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
10వ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించారు. 19 నుంచి 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ చేపట్టారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్ చేశారు. ఇక 10 ఫలితాల కోసం bse.ap.gov.in అనే వెబ్ సైట్ ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లోడ్ చేసుకోవాలంటే..ఫలితాలు విడుదలైన వారం రోజులకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.
AP SSC ఫలితం 2023ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి
స్టేజ్ 1: bse.ap.gov.in లో అధికారిక BSE వెబ్ సైట్ ను సందర్శించాలి
స్టేజ్ 2: హోమ్ పేజ్ లో అందుబాటులో ఉన్న లింక్ పై క్లిక్ చేయాలి
స్టేజ్ 3: రోల్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి
స్టేజ్ 4: మీ AP SSC 10వ తరగతి ఫలితం 2023 స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది
స్టేజ్ 5: దానిని డౌన్ లోడ్ చేసుకొని తదుపరి వినియోగం కోసం ప్రింటౌట్ తీసుకోండి.
మే చివరి వారంలో తెలంగాణ టెన్త్ రిజల్ట్స్
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 19వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 13 నుంచి వాల్యుయేషన్ ప్రారంభం కాగా పూర్తి కావడానికి 40 రోజుల సమయం పట్టనుంది. వాల్యుయేషన్ పూర్తైన తర్వాత రిజల్ట్స్ ని ప్రకటిస్తారు. అంటే మే చివరి వారంలో తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.