AP SSC Results 2023: 'పది' పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

AP SSC Results 2023: 'పది' పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

Update: 2023-05-06 06:03 GMT

AP SSC Results 2023: ‘పది’ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 6,09, 081గా ఉంది.. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేశాం.. 8 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని.. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తున్నట్టు తెలిపారు మంత్రి బొత్స. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 72.26గా ఉంది.. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. మరోసారి బాలికలే పైచేయి సాధించారు. 87. 47 శాతం ఉత్తీర్ణతతో పార్వతి పురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 60. 72 శాతంతో చివరి ప్లేస్ లో నంద్యాల జిల్లా ఉన్నది.

AP SSC ఫలితం 2023ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి

స్టేజ్ 1: bse.ap.gov.in లో అధికారిక BSE వెబ్ సైట్ ను సందర్శించాలి

స్టేజ్ 2: హోమ్ పేజ్ లో అందుబాటులో ఉన్న లింక్ పై క్లిక్ చేయాలి

స్టేజ్ 3: రోల్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి

స్టేజ్ 4: మీ AP SSC 10వ తరగతి ఫలితం 2023 స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది

స్టేజ్ 5: దానిని డౌన్ లోడ్ చేసుకొని తదుపరి వినియోగం కోసం ప్రింటౌట్ తీసుకోండి.

Tags:    

Similar News