Airports Authority of India Jobs 2023: ఇంటర్ చదివిన నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఎయిర్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు..!
Airports Authority of India Jobs 2023: ఇంటర్ చదివిన నిరుద్యోగులకు మంచి అవకాశం లభించింది. ఎయిర్పోర్టులో ఉద్యోగం చేసే ఛాన్స్ వచ్చింది.
Airports Authority of India Jobs 2023: ఇంటర్ చదివిన నిరుద్యోగులకు మంచి అవకాశం లభించింది. ఎయిర్పోర్టులో ఉద్యోగం చేసే ఛాన్స్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 436 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులను మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
అర్హులైన అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 27 సంవత్సరాలకు మించకూడదు. ఎంపికైన వారు చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మధురై, తిరుచ్చి, రాయ్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్‌సర్, లేహ్, డెహ్రాడూన్, పుణె, ఇండోర్, సూరత్ లలో పనిచేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,500 నుంచి రూ.22,500. చెల్లిస్తారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.100. చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 15.11.2023.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aaiclas.aero చూడాలని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది.