ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఈసీ కచ్చితంగా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని వెల్లడించింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పింది. సుప్రీం ఆదేశాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్టయింది.