Redmi 14R: మిడిల్ క్లాస్ ఫోన్.. రెడ్‌మి అరాచకం.. రూ.13 వేలకే అదిరిపోయే ఫీచర్లు..

Redmi 14R: షియోమీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Redmi 14Rను లాంచ్ చేసింది. రూ.13 వేలకే కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-16 07:26 GMT

Redmi 14R

Redmi 14R: స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ Redmi 14Rను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌ను మొదటగా చైనా మార్కెట్‌లో తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇది బడ్జెట్ ప్రైస్‌లోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో అట్రాక్డ్ ఫీచర్లు ఉంటాయి. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై వస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. Xiaomi HyperOS స్కిన్‌తో Android 14లో ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫోన్ 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 13MP బ్యాక్ కెమెరా, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. Redmi 14R చైనాలో డీప్ ఓషన్ బ్లూ, లావెండర్, ఆలివ్ గ్రీన్, షాడో బ్లాక్ కలర్ వంటి నాలుగు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో Xiaomi అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

అయితే రెడ్‌మి 14ఆర్ ఇండియా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అవుతుందా లేదా అనే దానిపై ఇంకా సమాచారం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ ధరలు, కాన్ఫిగరేషన్‌లతో చైనాలో ప్రారంభించారు. 4GB RAM + 128GB స్టోరేజ్ కోసం దాదాపు రూ. 13,000, 6GB RAM + 128GB స్టోరేజ్ కోసం దాదాపు రూ. 17,700 చెల్లించాల్సి ఉంటుంది. అయితే 8GB RAM + 128GB స్టోరేజీకి ఇది దాదాపు రూ. 20,100. 8GB RAM + 256GB స్టోరేజ్‌కి ఇది దాదాపు రూ. 22,500.

Redmi 14R Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 6.68-అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ ,అవుట్‌డోర్ విజిబిలిటీ కోసం 600 నిట్స్ బ్రైట్నెస్‌తో వస్తుంది. Xiaomi HyperOSతో Android 14లో రన్ అవుతుంది. Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 8GB RAMతో జత చేయబడిన బడ్జెట్ ఫోన్.

కెమెరా గురించి మాట్లాడితే ఫోన్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీనిలో సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో వస్తుంది. ఈ సెటప్ బడ్జెట్ సెగ్మెంట్‌లో Redmi 14Rని ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తుంది.

Tags:    

Similar News