Wayanad Landslides: కేరళలో కొండచరియలు విరిగిపడి 19 మంది దుర్మరణం.. శిథిలాల కింద వందలాది మంది

Wayanad landslides: కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు చిన్నారు సహా 19 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Update: 2024-07-30 03:55 GMT

Wayanad landslides:కేరళలో కొండచరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం..శిథిలాల కింద వందలాది మంది

Wayanad landslides:కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మరణించారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనాస్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మెప్పాడి ముండకైలో ప్రాంతంలో అర్థరాత్రి 1గంటలకు ఆ తర్వాత తెల్లవారుజామున 4గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే కేరళ రాష్ట్ర విపత్తనిర్వహణ దళం, ఫైరింజన్లు స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు రెస్య్కూ టీమ్ సైతం వయనాడ్ కు చేరుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం వాటిల్లుతోంది.

అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుని ఉంటారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయచర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు.

Tags:    

Similar News