పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ.. సీనియర్ నేత పి. శివకుమార్ ను బహిష్కరించింది వైసీపీ. తెలంగాణలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని పేర్కొంటూ.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పి. శివకుమార్.. ప్రధాన కార్యదర్శి హోదాలో లెటర్ ప్యాడ్ మీద రాసి మీడియాకు ఇచ్చారు. ఈ విషయం వైసీపీ అధిష్టానానికి చేరింది. దాంతో తీవ్రంగా స్పందించి శివకుమార్ ను శాశ్వతంగా బహిష్కరించింది. ఇక తన బహిష్కరణపై స్పందించారు శివకుమర్. జగన్ ఆంధ్రాలో ఫోకస్ పెట్టిన సందర్బంగా భవిష్యత్ లో తెలంగాణలో పోటీ చేస్తాడని అనుకోవడం లేదు. 2024 కు సంస్థాగతంగా బలపడదామని చెబుతున్నా.. తనకు నమ్మకం లేదని చెప్పారు శివకుమర్. తనను బహిష్కరించడం సరికాదని.. రాజ్యాంగం ప్రకారం పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. రాబోయే ఐదేళ్లలో వైసీపీని తెలంగాణలో సంస్థాగతంగా బలోపేతం చేసి జెండా ఎగురవేస్తామని చెప్పారు. అలాగే జగన్ ఆంధ్రాలో సీఎం కావాలని కోరుకుంటున్నట్టు శివకుమార్ స్పష్టం చేశారు.