నిన్న(శుక్రవారం) తెలంగాణలో పోలింగ్ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. దాడి అనంతరం వంశీ.. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంశీని పరామర్శించారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక ఇలా భౌతిక దాడులకు దిగారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు జరగడం శోచనీయం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ్.. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజకూటమి అధికారంలోకి రాబోతుంది.. ప్రజకూటమి అత్యధిక సీట్లను కైవసం చేసుకుని అధికారం చేపడుతుందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు మా ధన్యవాదాలు అని ఆయన అన్నారు. అలాగే నేషనల్ మీడియా ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడిన ఉత్తమ్.. అవి కరెక్ట్ కాకపోవచ్చు అని తమతోనే వారున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.