స్త్రీ ముఖం అనగానే గుర్తొచ్చేది అందం. చంద్రునిపై మచ్చల్లా ఆ అందానికి అవాంచిత రోమాలు తోడైతే ఆడవారి బాధ వర్ణాతీతం. స్త్రీల ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల చాలా బాధపడుతుంటారు. చక్కని ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల ముఖం అందవికారంగా తయారవుతుంది. ఈ సమస్య స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనది. అయితే అవాంచిత రోమాలు చిన్నగా ప్రారంభమై కొన్ని సమయాల్లో అకస్మాత్తుగా అత్యంత వృద్ది చెందుతాయి. దీనినే హిర్స్యుటిస్మ్ అని అంటారు. అంటే ఈస్ట్రోజెన్ హార్మోనుల అసమతుల్యత వల్ల ఈ అవాంచిత రోమాల స్థాయి పెరుగుతుంది.
నివారణ మార్గాల్లో కొన్ని మీకోసం:
పసుపు: భారతీయ సంస్కృతిలో పెద్దపీట వేయబడిన పసుపు ప్రతి ఇంటిలోను దొరికే వనమూలిక. అన్నింటా వాడబడే ఈ పసుపు సౌందర్య రహస్యానికి కూడా పని చేస్తుంది. పూర్వం పసుపును చర్మం సున్నితంగా ఉండేందుకు పెంపొందించేందుకు ప్రతిరక్షకం. దీనివల్ల మేని ఛాయ వృద్ది చెంది అవాంచిత రోమలను పోగొడుతుంది.
శనగపిండి: భారతీయ సంప్రదాయ పారంపర్యంగా ఎన్నో ఏళ్ల నుంచి ఇంటిలో వాడే ఫేస్ మాస్క్ గా వాడబడుతోంది. మృత చర్మం మళ్ళీ ప్రకాశవంతంగా తయారయ్యేలా ఇది వృద్ది చేస్తుంది. శనగపిండిని పసుపుతో కలిపి వాడటం వల్ల ఇతర ఫేషియల్స్ కంటే మంచి ఫలితానిస్తుంది. సహజసిద్దమైన నివారణా మార్గాలు ఎటువంటి దుష్ప్రభావాలను ఇవ్వదని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలా శెనగపిండి, పసుపు వాడటం వల్ల పెరుగుదలను నియంత్రించవచ్చు.
గ్రుడ్డు మాస్క్ : కోడి గుడ్డులోని తెల్ల సొనను, ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై రాసి.. ఆరనివ్వాలి. అవాంచిత రోమాలను కూడా తేలికగా తొలగించవచ్చు. ఈ నివారణా మార్గం చాలా సులువు. ఎందుకంటే ఇందుల కలిపే దినుసులు అన్ని చోట్లా దొరకటం వల్ల ఇది చాలా ప్రభావవంతమైనది. అంతేకాక మంచి ఫలితాలనిస్తుంది.
ఆహారంలో పైటోఈస్ట్రొజన్స్ ఉందేల చూసుకుంటే: అవాంచిత రోమాల నివారణకు మంచి ఆహారం ఎంతో అవసరం.ఈ సమస్య హార్మోనుల లోపం వల్ల కలుగుతుంది. అయితే ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం కారణంగా కూడా ఇది సంభవిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కేవలం పైటో ఈస్ట్రోజన్ లోపం వల్ల సంభవిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అవిశ గింజలు,సోపు,ఆల్ఫాల్ఫా(రజిక)గోటుకు(ఉత్తర భారతదేశంలో బ్రహ్మి)పైటో ఈస్ట్రోజన్స్ పెరుగుదలకు తోడ్పడతాయి. హిర్స్యుటిస్మ్ తగ్గేందుకు మనం తీసుకునే ఆహారం ప్రముఖ పాత్రను పోషిస్తుంది.