అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశించిన కోర్టు తీర్పును అమలు చేస్తున్న ఓ అధికారిని కాల్చి చంపాడో వ్యక్తి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన షేల్ బాలా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ గౌరవ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో కోర్టు ఉత్తర్వులను అమలు పరుస్తున్నారు. ఈ మేరకు మంగళవారం షేల్ బాలా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారుతో కలిసి కసౌలీ పట్టణానికి చేరుకున్నారు. పోలీసుల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. ఈ క్రమంలో మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్ హౌజ్ వద్దకు చేరుకున్నారు. నాలుగు అంతస్తులకు మాత్రమే అనుమతి ఉన్నఈ గెస్ట్‌హౌజ్‌ను ఆరు అంతస్తులకు పెంచినందున ఆ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ షేల్ బాలా ఆదేశించారు. దీంతో గెస్ట్ హౌజ్ యజమాని విజయ్ సింగ్ అక్కడికి చేరుకున్నారు.అధికారులతో చర్చలు ప్రారంభించాడు కానీ వారు ఎంతకీ వినలేదు అక్రమ కట్టడాన్ని కూల్చివేయాల్సిందిగా బుల్డోజర్ ఆపరేటర్ ను ఆదేశించారు. దీనికి కోపోద్దీక్తుడైన విజయ్ సింగ్ అధికారులపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లేడీ అధికారి షేల్ బాలా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వెంటనే రంగంలోకి తిగిన పోలీసులు క్షతగాత్రుల్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందుతున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.