మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ

Update: 2018-12-24 12:11 GMT

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్ సీఎంతో భేటి అయ్యారు.  భువనేశ్వర్ నుంచి కోల్‌కతా చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ సచివాలయం చేరుకున్న ఆయనకు సీఎం మమతా బెనర్జీ సాధరంగా స్వాగతం పలికారు. అనంతరం దేశ రాజకీయాలతో పాటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవసరాన్ని వివరించారు. దేశ రాజకీయాల్లో  మార్పు వస్తుందన్నందున ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి నడవాలని కోరారు. పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల తరువాత  మెజార్టీ స్ధానాల్లో ఉన్నందున కీలక పాత్ర పోషించాలని కోరారు. 

అంతకు ముందు ఒడిశాలోని కోణార్క్, పూరీ జగన్నాధ స్వామి ఆలయాలను కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు పూరీ జగన్నాథస్వామి  ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కేసీఆర్‌ను  ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోణార్క్ ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా చేరుకున్నారు.  కాసేపట్లో దుర్గామాత ఆలయాన్ని  సందర్శించుకోనున్న ఆయన రాత్రి ఏడు గంటలకు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు.  

Similar News