టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారిని వాడుకుని వదిలేస్తున్నారని.. ఛాన్సులు ఇవ్వడం లేదంటూ విరుచుకుపడుతోంది. ఇంటర్వ్యూలు, డిబేట్లలో పాల్గొంటూ టాలీవుడ్‌ని హడలెత్తిస్తోంది.
అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ లైవ్‌లో కొందర్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
టాలీవుడ్‌లో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయి. అందుకే నేను వాటిని లీక్ చేస్తున్నాను. మీడియా సాక్ష్యంగా నేను అన్ని విషయాలు బయటపెడుతా. నా వద్ద కొన్నింటికి ఆధారాలు ఉన్నాయి. కొన్నింటికి ఆధారాలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో మా తెలుగోళ్లకి ఛాన్స్ ఎందుకు ఇవ్వరని డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతల్ని కడిగేయండి అని ఫ్యాన్స్‌ని కోరుతోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ బతికుంటే తెలుగు అందాలు బతికి ఉండేవని ఓ పోస్టులో వెల్లడించింది. అయితే త్వరలో రెడ్డిగారి గానా భజానా ప్రసారం అంటూ మరో సంచలనానికి తెరలేపింది శ్రీరెడ్డి. ‘తప్పు చేసిన వాడెవడైనా, రెడ్డి అయినా తాటా తీస్తా. త్వరలో రెడ్డి గారి గానా భజానా ప్రసారం అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇంతకీ ఎవరా రెడ్డిగారు? అని నెటిజన్లు దీనిపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు
కొద్దిరోజుల క్రితం తాను శేఖర్ కమ్ములను ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను నటించిన అరవింద్2 సినిమా డైరెక్టర్ పేరు కూడా శేఖర్. గుమ్మడి కాయల దొంగ అంటే శేఖర్ కమ్ముల భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదు.
శేఖర్ అంటే ఆయనెందుకు రెస్పాండ్ అవుతున్నారు. ఆయన లీగల్ నోటీసులు పంపితే నేను అంగీకరించను. నేను శేఖర్ కమ్ముల పేరును ఎక్కడా డైరెక్ట్‌గా చెప్పలేదని సూచించారు. ఓ టీవీ చర్చలో ఇండియన్ ఐడల్ శ్రీరాం పేరు కూడా బయటకు వచ్చింది. ఇండియన్ ఐడల్ శ్రీరాంతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను శ్రీరెడ్డి బయటపెట్టింది. కృష్ణవంశీ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ నా వద్ద ఆధారాలు లేవు అని చెప్పింది.