కాంగ్రెస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్‌లోకి వలసలు...ఓ ఎమ్మెల్సీ, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జంప్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో కుదుపు తగిలింది. పాలమూరు నుంచి ఒకేసారి ఒక ఎమ్మెల్సీతో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. రేపు కేసీఆర్ సమక్షంలో... ప్రగతి భవన్‌లో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. దామోదర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కృష్ణారెడ్డి, అబ్రహం రేపు టీఆర్ఎస్‌లో చేరనున్నారు.