కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీ.కాంగ్రెస్ హైకోర్టు కెళ్లింది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, ఎంఎస్ ప్రభాకర్, కె.దామోదర్ రెడ్డి, ఆకుల లలిత తెలంగాణ రాష్ట్రసమితిలో చేరారు. కేవలం మేజార్టీ సభ్యులకోరికే కాంగ్రెస్ విపక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని మండలి చైర్మన్ కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ విపక్షాన్నిటీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ఈ నెల 21న అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ నేడు సెలవులో ఉన్నారు కాగా ఈనెల 26తేదీన పిటిషన్ విచారణకు రానుంది.