ఇస్రో మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ వేదికగా జరిగిన PSLV-C-43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా హైసిన్, సీరియో అనే రెండు స్వదేశీ ఉపగ్రహాలతోపాటు 8 విదేశాలకు చెందిన మరో 29 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఒక మైక్రో, 29నానో ఉపగ్రహాలున్నాయి. వీటిల్లో 23శాటిలైట్లు అమెరికాకు చెందినవి కాగా ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్, మలేసియా, నెదర్లాండ్స్, స్పెయిన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉంది. ఇవాళ(గురువారం) ఉదయం 9 గంటలకు 57 నిమిషాలకు…. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్వీ – సీ43 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాగా ఈ రాకెట్లో ప్రధాన ఉపగ్రహమైన హైసిస్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది. దీని బరువు సుమారు 380 కిలోలు. ఈ శాటిలైట్‌ను భూమికి 636 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఈ మిషన్ కాలపరిమితి ఐదేళ్లు. భూ ఉపరితల పరిస్థితులను పరిశీలించడం హైసిస్ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో షార్‌లో ఆనందోత్సాహలు వెల్లివిరిశాయి. శాస్త్రవేత్తలు పరస్పరం కరచాలనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.