అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి పతనంతో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. అలా పెరుగుతూ పోయి ఈ ఏడాది అక్టోబరులో గరిష్టానికి చేరాయి. ప్రస్తుతం ముడి చమురు ధరలు తగ్గుతుండడంతో ఇంధన ధరలు నేలచూపులు చూస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి..దాంతో ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ:69.79 పైసలుగా ఉంది. ఈ ఏడాది జనవరి 4న ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 69 రూపాయల 97 పైసలుగా ఉంది. జనవరి 4 తర్వాత పెట్రోలు ధర ఇంత తక్కువకు రావడం ఇదే మొదటిసారి. అలాగే లీటర్ డీజిల్ ధర 63 రూపాయల 83 పైసలుగా ఉంది. మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ: 75.41, డీజిల్ ధర రూ: 66.79. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ: 71.89, డీజిల్ ధర రూ: 65.59. చెన్నైలో పెట్రోల్ ధర రూ: 72.41, డీజిల్ ధర రూ: 67.38గా ఉంది.
వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
లీటర్ పెట్రోల్ ధర
———————–
ముంబై – రూ. 75.41
హైదరాబాద్ రూ. 74.02
విజయవాడ రూ.73.54
చెన్నై రూ.72.41
కోల్‌కతా రూ. 71.89
ఢిల్లీ – రూ 69. 79.
లీటర్ డీజిల్ ధర
———————-
హైదరాబాద్ రూ. 69.37
విజయవాడ రూ. 68.54
చెన్నై రూ. 67.38
ముంబై రూ.66.79
కోల్‌కతా రూ. 65.59
ఢిల్లీ రూ. 63. 83 పైసలు