అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కోర్టు దోషిగా తేల్చింది. దాంతో పాక్ కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా 1.5 బిలియన్ డాలర్ల జరిమానాను కూడా విధించింది. కాగా అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో గతంలోనే నవాజ్ షరీఫ్ పై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి గతవారం కొన్ని డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ న్యాయవాది కోర్టును కోరారు. ఇందు కోసం కనీసం వారం రోజుల పాటు సమయాన్ని నవాజ్ షరీఫ్ తరపు కోరారు. కానీ నవాజ్ షరీఫ్ తరపు న్యాయవాది అభ్యర్థననను కోర్టు తోసిపుచ్చింది. ఇవాళ ఆయనకు శిక్ష ఖరారు చేసింది.