ఇప్పటికే జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్న మొదట్లోనే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆదివారం పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (మమత పార్టీ)లపై మనం పోరాడాలని నేతలకు రాహుల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తో ముందస్తు పొత్తు వార్తలను టీఎంసీ కొట్టేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇలా ఉంటే వచ్చే ఏడాది కోల్ కతాలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తుంది. కాంగ్రెస్-టీఎంసీల మధ్య మహాకూటమి కానీ, పొత్తు కానీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.