మెడిసిన్ అడ్మిషన్స్ కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ - 2018 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షా ఫలితాలను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ విడుదల చేసింది. ఫలితాలకోసం సంబంధిత వెబ్ సైట్ nbe.edu.in. సందర్శించాలని అధికారులు సూచించారు. ఇందులో ఎవరికి ఎంత మెరిట్ , ఎవరికి ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
అయితే నీట్ పరీక్ష ఫలితాల కోసం వెబ్ సైట్లో ఇలా చెక్ చేసుకోవాలి.
1. ముందుగా విద్యార్ధులు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అఫీయల్ వెబ్ సైట్ nbe.edu.in సందర్శించాలి.
2 వెబ్ సైట్లోకి ప్రవేశించిన అనంతరం నీట్ పీజీ లింక్ ను క్లిక్ చేయాలి.
3. లింక్ క్లిక్ చేసిన తరువాత నీట్ పరీక్షా ఫలితా కోసం తమకు కేటాయించిన వివరాల్ని అందులో పొందు పరచాలి.
4. అలా పొందుపరిచిన అనంతరం ఆ లింక్ ను క్లిక్ చేస్తే రిజల్ట్ తో పాటు విద్యార్ధులు వివరాలు డిస్ ప్లే అవుతుంది.