నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. వినేందుకు కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అంతా అయిపోయాక.. చివర్లో.. సినిమా హీరో అల్లు అర్జున్.. జనగణమన అంటూ జాతీయ గీతాన్ని ఆలపించాడు. ఇది కూడా బానే ఉంది. సినిమా ఆర్మీ నేపథ్యంలో ఉంది కాబట్టి.. సహజంగా షూటింగ్ సమయంలో దేశభక్తి నిలువెల్లా నిండిపోతుంది కాబట్టి.. ఇది కూడా ఓకే.
కానీ.. ఇలాంటి పని ప్రతి సినిమా కార్యక్రమం చివర్లో చేస్తేనే బాగుంటుంది కదా. నా పేరు సూర్య సినిమా కోసమే.. ఇలా చివర్లో జనగణమన అనేస్తే.. అది సినిమా స్టంట్ కాకపోతే.. ఇంకేం అవుతుంది? ఇప్పటికే నా ఇల్లు ఇండియా అన్న టాగ్ లైన్ తో వస్తున్న బన్నీ.. సోషల్ మీడియాలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అన్న హోదాను పెట్టుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే కదా.
ఇప్పుడు.. మరోసారి అలాంటి పనే చేస్తే.. లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. బన్నీ ఇలాంటి ట్రిక్స్ విషయాల్లో ఎవరికీ దొరక్కుండా జాగ్రత్తవహించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. దేశభక్తి కోసం కాకుండా… ఆయన తన సినిమా ప్రమోషన్ కోసమే ఇలాంటి పని చేశాడన్న అపవాదును భరించాల్సి ఉంటుంది. తర్వాత.. చెప్పను బ్రదన్.. అని అన్నా.. సమాధానం చెప్పించే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.