ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ

Update: 2018-12-23 14:04 GMT

బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కావాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం అయ్యారు. ముందుగా  విశాఖ నుంచి భువనేశ్వర్ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కేసీఆర్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతకుముందు విశాఖ విమనాశ్రయం నుంచి కేసీఆర్ నేరుగా శారదాపీఠం వెళ్లారు. అక్కడ పీఠం ప్రతినిధులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులందుకున్నారు. అక్కడ నుంచి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ చేరుకొని.. ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్ తో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యతకపై చర్చ జరిగింది. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడారు..  దేశ రాజకీయాలపై తమ మధ్య చర్చ జరిగిందన్నారు నవీన్‌ పట్నాయక్‌.. భావ స్వారూప్య పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

Similar News