త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మేం ఎవ్వరితోనూ కలవం.. స్వతంత్రంగానే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం ఇండియా టుడే నిర్వహించిన కాన్ క్లేవ్‌లో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ..టీఆర్ఎస్‌కు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవలసిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. ఎవరైనా పొత్తు కోసం తమ దగ్గరకు రావాల్సిందేనని చెప్పారు. తాము ఎన్డీఏకు , యూపీఏకు సమాన దూరం పాటిస్తామన్న కేసీఆర్...తాము తీసుకునే నిర్ణయాలు...తెలంగాణ ప్రయోజనాల ఆధారంగా ఉంటాయని అన్నారు.