కేంద్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏ పార్టీ గెలుస్తుందనే అంశంగా నేషనల్ మీడియా సర్వేలు నిర్వహిస్తుంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సర్వే చేపట్టిన నేషనల్ మీడియా ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తోందని విషయాన్ని వెల్లడించాయి.
కొద్దిరోజుల క్రితం 2019ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తోందనే అంశంపై నేషనల్ మీడియా రిపబ్లికన్ టీవీ సీ- ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వైసీపీ హవా కొనసాగిస్తుందని తేల్చిచెప్పింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఏపీలో ఉన్న25 ఎంపీ సీట్లలో 13 సీట్లను వైసీపీ గెలుస్తుందని తేల్చి చెప్పింది. బీజేపీ తో పొత్తు ఉంటే టీడీపీకి 12 సీట్లు అవకాశం ఉంది. లేదంటే అన్ని సీట్లు దక్కడం కూడా కష్టమేనని సూచించింది.
అయితే ఇప్పుడు ఇండియా టుడే - కార్వీ లు సంయుక్తంగా సర్వే చేశాయి. ఆ సర్వేలో ఎన్డీఏ కూటమి 258 సీట్లు, యూపీఏ కూటమి 202 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఎన్నికల్లో ఓట్ల ప్రాదిపదికన ఈ సర్వేలో మోడీకి 53శాతం, రాహుల్ గాంధీకి 22శాతం ఓట్లతో మద్దతు కూడగట్టుకున్నారు.