అదేమంత పెద్ద విషయం? క్షమాపణ చెప్పను: సీఎం

Update: 2018-12-26 11:03 GMT

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ హత్య కేసులో నిందితుల్ని పట్టుకుని కాల్చిపారేయాలన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సీఎం వైఖరిపై విమర్శలు వచ్చాయి. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కుమారస్వామి, ఓ మరణాన్ని చూసిన ఆగ్రహంతో ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప, పోలీసులకు ఇచ్చిన ఆదేశాలుగా వాటిని భావించరాదని అన్నారు. కాగా దినిపై క్షమాపణ చెప్పేదే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇదేమంత పెద్ద విషయం కాదు భావోద్వేగాలకు గురికావడం మానవ నైజం అని కేవలం పరిస్థితిని బట్టే అలా మాట్లాడాను తప్ప ఇంకా వేరే విధంగా కాదని కుమారస్వామి అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తాను వివరణ ఇచ్చాను ఇంక చెప్పాడానికి ఏం లేదు, ఇదే నా చివిరి మాట అని సిఎం కుమారస్వామి చెప్పుకొచ్చారు.

Similar News