డిసెంబర్ 7వ తేదీకి ఒక ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రంగా అవతరించాక.. మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఓటు ఒక్క ఆవశ్యకతను వివరిస్తూ.. వివిధ ప్రచారం మధ్యమాల్లో అవగాహన పెంచారు. ఆఖరికి సోషల్ మీడియాలో సైతం ఓటు అవగాహన కల్పించారు. అయినా కూడా కొంతమంది ఓటర్లలో కొన్ని సందేహాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలకు.. పట్టణాల్లోని ఓటర్లు.. తాము ఓటు వేసే పోలింగ్ స్టేషన్ చిరునామా తెలియక గందరగోళానికి గురవుతుంటారు. అయితే అలా ఇబ్బంది పడకుండా ఓటరు తమ పోలింగ్ స్టేషన్ చిరునామాను ఆన్ లైన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
అందుకోసం ఇలా చెయ్యాలి.
* ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ http://www.ceotelangana.nic.in/ ను ఓపెన్ చెయ్యాలి.
*కేటగిరీలో 'సెర్చ్ యువర్ నేమ్' టాబ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో Assembly constituency ని ఎంపిక చేసుకోవాలి.
* ఓటరు వివరాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Search by Details / Search by EPIC No అని రెండు ఆప్షన్లు వస్తాయి. వాటిలో Search by EPIC No ను ఓపెన్ చేసి ఎపిక్ నెంబర్ ను ఎంటర్ చెయ్యాలి. ఆ తరువాత రాష్ట్రం సెలెక్ట్ చేసి.. క్యాప్చ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మీకు సంబంధిన వివరాలు వస్తాయి. అందులోనే మీరు ఓటు చేసే పోలింగ్ స్టేషన్ చిరునామా కూడా ఉంటుంది. అలాగే మరో మార్గం Search by Details ఇందులో మీకు సంబంధించిన వివరాలు మొత్తం ఇవ్వాలి.. ఆ తరువాత సెర్చ్ చెయ్యాలి. ఇందులో మీకు సంబంధించిన వివరాలు మొత్తం అందులో వస్తాయి. అక్కడ కూడా మీ పోలింగ్ స్టేషన్ చిరునామా తెలుసుకోవచ్చు.