ఓటర్‌ గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు.. ఎలాగంటే..

Update: 2018-12-06 03:24 GMT

తెలంగాణ పోలింగ్‌కు మరో 24 గంటల సమయమే ఉంది. దాంతో పోలింగుకు ఒకరోజు ముందుగానే అంటే నేడు(గురువారం) సెలవుగా ప్రకటించారు ఎన్నికల అధికారులు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభం కానుంది. దీంతో పోలింగ్‌ దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. ఇక ఓటర్‌ కార్డు లేదని ఎవరూ పరేషాన్‌ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు కార్డులు లేకున్నా ప్రజలు ఓటు వేయొచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డ్, గ్యాస్ బిల్, లాంటివి చూపించి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, బ్యాంకు పాస్‌బుక్‌, పోస్టాఫీస్‌ ఖాతా పుస్తకం, పాన్‌కార్డు, తదిరత కార్డులు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Similar News