స్నేహితుడిని చంపి.. తలతో పోలీస్‌ స్టేషన్‌కు..

Update: 2018-09-30 02:14 GMT

తన అమ్మను తిట్టినందుకు ఓ వ్యక్తి అతని స్నేహితుడిపై దారుణానికి పాల్పడ్డాడు. అతడి తల నరికి ఏకంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మండ్య జిల్లాలోని చిక్కబాగిలుకి చెందిన పశుపతి (28), హతుడు గిరీశ్‌ (38) ఇద్దరు స్నేహితులు. ఇటీవల గిరీశ్‌.. ఒక విషయంలో పశుపతి తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో అప్పటినుంచి పశుపతి.. గిరీష్ పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం మాట్లాడాలని గిరీశ్‌ను ఊరిబయటకు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి చంపాడు. అంతేకాదు అతడి తలతో 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఆ తలతో వచ్చి లొంగిపోయాడు. ఎవరైనా తన తల్లిని ఏమైనా అంటే తట్టుకోలేనని.. అలాంటిది అసభ్యంగా ప్రవర్తిస్తే ఇలాగె చేస్తానని పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తోంది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Similar News