నల్ల మచ్చలకు నేచురల్ రెమెడీస్ 

Update: 2017-09-17 16:08 GMT

కొంతమందిలో ముఖంలో మచ్చలు, స్పాట్స్, మొటిమలుంటాయి. సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్‌గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు వివిధ రకాల కారణంగా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా టీనేజ్‌లో వచ్చే మొటిమల కారణంగా ముఖంలో స్పాట్స్ ఏర్పడతాయి. ఇవి మొదట్లోనే నివారించకపోతే గుంటలు పడే ప్రమాదం ఉంటుంది.   మొటిమలతో ఏర్పరడే మచ్చలు చారలుగా ఏర్పడకపోయినా, ఆ మచ్చలు కొంత వరకూ బాధ కలిగిస్తుంది. ఇటువంటి మచ్చలు, చారలను నివారించడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే ఖరీదైన క్రీములను ఉపయోగిస్తే మచ్చలు కొంత వరకూ తొలగిపోయినా, వాటి గుర్తులు చారలుగా చర్మం మీద అలాగే నిల్చి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఉత్తమ రెమడీస్ అప్లై చేయడం ద్వారా మచ్చలను మరియు ఛారలను లైట్ చేస్తుంది. లేదా పూర్తిగా మాయం చేస్తాయి. మరి ఆ ప్రభావంతమైన రెమడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...  ముఖంపై నల్లని మచ్చలకు ముఖ్య కారణం విటమిన్ సి లోపించడమే. రెండు చెంచాల నిమ్మరసంలో చిన్న దూది ఉండను ముంచి ముఖంపై మచ్చలున్నచోట రాయాలి. పది నిముషాల తరవాత చల్లని నీటితో కడగాలి. నిమ్మరసం రాసినప్పుడు ముఖంపై ఎండ పడకుండా చూసుకోవాలి. 

గంధం పొడికి రోజ్‌వాటర్‌ను, రెండు చుక్కల గ్లిజరిన్‌ను కలిపి పేస్టులా చేసుకుని రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మచ్చలూ పోతాయి. చర్మ ఛాయా మెరుగుపడుతుంది. లాక్టిక్ యాసిడ్ ఉండే పచ్చిపాలను ముఖంపై ఉండే మచ్చలకు రాసుకుని రాత్రంతా ఉంచుకొని తెల్లవారిన తరవాత కడిగితే.. మచ్చలు తగ్గుముఖం పడతాయి. అలాగే చెంచా మజ్జిగలో చెంచా నిమ్మరసం కలిపి మచ్చలపై రాస్తే క్రమంగా మచ్చలు మటుమాయమవుతాయి. కలబంద గుజ్జును మచ్చలపై రాసి, అరగంట తరవాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మచ్చలు పోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. చెంచా పెరుగుకు రెండు చెంచాల ఓట్‌మీల, చెంచా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకుని అరగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజుకోసారైనా చేస్తుంటే చర్మంపై పేరుకున్న నలుపుదనంతో పాటూ మచ్చలూ మాయమవుతాయి. 

Similar News