భారత ప్రధాని నరేంద్రమోడీ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. బూత్ స్థాయిలో కార్యకర్తలు అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానాల ఇవ్వలేని దుస్థితిలో మోడీ ఉన్నరంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఇటివలే తమిళనాడు, పుదుచ్ఛేరి బూత్ స్థాయి కార్యకర్తలతో మోడీ వీడియో కాన్ఫీరెన్స్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే కాగా మధ్యతరగతి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంపై అంత ఆసక్తి చూపుతున్నారు సరే అలాగే వారి సంక్షేమం పట్ల మాత్రం ఎందుకు చూపడంలేదంటూ కార్యకర్త వేసిన ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి దాపరిచిందని ధ్వజమేత్తారు. ప్రధానమంత్రి హోదాలో ఉండటం కాదు ప్రజలకు సమాధానం చెప్పాగలిగే సమర్యర్థం ఉండాలని అని అన్నారు.