ఆత్మహత్య చేసుకోబోతున్న తల్లీకొడుకులను కాపాడబోయి ఓ ఆటో డ్రైవర్ తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో తన కొడుకుతో సహా మీథాపూర్ కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. వీరిని గమనించిన ఓ ఆటోడ్రైవర్ వెంటనే వారిని కాపాడటానికి అందులోకి దూకాడు. వారిని కాపాడడానికి కుదరలేదు. ఈ క్రమంలో స్థానికులు కొందరు గమనించి అతికష్టం మీద తల్లీకొడుకుని కాపాడగలిగారు.. కానీ డ్రైవర్ మాత్రం నీటిలోనే మునిగిపోయాడు. కానీ ఆయన ఆచూకీ మాత్రం దొరకలేదు. తల్లీకొడుకుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.