ఆ అఫైర్ పై రంగమ్మ‌త్త భ‌ర్త ఏమ‌న్నాడంటే

Update: 2018-04-05 15:40 GMT

మీడియాలో హెచ్ ఆర్ ఉద్యోగిగా జాయిన్ అయిన అన‌సూయకు అదృష్టం త‌లుపు త‌ట్టి వెండితెర‌పై అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆ అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటున్న అన‌సూయ తాజాగా సుకుమార్ - రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రంగ‌స్థ‌లంలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. రంగస్థలం చిత్రం దూసుకుపోతున్న నేపథ్యంలో ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని మీడియాతో పంచుకున్నారు.  
రంగ‌మ్మ‌త్త పాత్ర‌కు ముందు పాత్ర‌కు త‌రువాత త‌న‌పై ఉన్న ఇమేజ్ కు భిన్నంగా ఆలోచిస్తున్నార‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. అంతేకాదు ఇక‌పై రంగమ్మ‌త్త పాత్ర చేయ‌న‌ని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇలాంటి పాత్ర భ‌విష్య‌త్తులో చేయ‌లేక‌పోవ‌చ్చు. త‌న సినీ కెరియ‌ర్ లో రంగ‌మ్మ‌త్త పాత్ర ను మ‌రిచిపోలేనిద‌ని అన్నారు. 
తాను యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ షో పై గ‌తంలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఫ్యామిలీ ఆడియెన్స్  జ‌బ‌ర్ద‌స్త్ అంటే ఇబ్బందిగా ఫీల‌వుతున్నార‌ని ,..కాబ‌ట్టి ఆ షోను అంద‌రూ చూసేలా ద్వంద‌ర్ధాలు త‌గ్గించామ‌ని, ఇప్పుడు ఫ్యామిలీ అంతా వినోదం పొందే మాదిరిగా జబర్దస్త్‌ను మార్చాం. దానికి కారణం మీడియానే. అందుకు మేము థ్యాంక్స్ చెబుతున్నాను. 
 మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకులు రాంగోపాల్ వర్మతో కలిసి పనిచేశాను. ఆ సమయంలో నాకు వర్మతో అఫైర్ అంటగట్టారు. అప్పుడు నేను ప్రెగ్నెంట్‌ను. ఆ వార్తలు చూసి చాలా భయపడ్డాను. కానీ నా భర్త అండగా నిలిచారు. ఏ విషయమైనా నేను నమ్మనంత వరకు నీవు భయపడే అవసరం లేదు అని నా భర్త చెప్పారు. ఒకవేళ నమ్మితే నీవు ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
 సినిమా పరిశ్రమలో రకరకాల మనుషులు ఉంటారు. మంచి, చెడు రెండు ఉంటాయి. మనం స్వీకరించే, ఎంచుకొనే రూట్ వల్లనే మనకు మంచి జరుగాలా? లేదా చెడు జరిగేది తెలుస్తుంది. సినిమా షూటింగ్‌లకు మా కుటుంబ సభ్యులను తీసుకెళ్లి చూపించాను. దాంతో వారు నాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. దాంతో యాక్టింగ్‌ కెరీర్‌లో కొనసాగుతున్న‌ట్లు సూచించారు.  

Similar News