Post Office Scheme: రోజుకు రూ. 50 పెట్టుబడితో లక్షాధికారి కావొచ్చు..ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసుకోండి

Update: 2025-03-12 05:13 GMT
Post Office Scheme: రోజుకు రూ. 50 పెట్టుబడితో లక్షాధికారి కావొచ్చు..ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసుకోండి
  • whatsapp icon

Post Office Scheme: పోస్టాఫీస్ తమ వినియోగదారులకోసం ఎన్నో పథకాలను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల కోసం పెట్టుబడి, పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. వీటిలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. పెద్ద పెద్ద బ్యాంకుల్లో కూడా సాధ్యం కాని వడ్డీని పోస్టాఫీస్ అందిస్తోంది. సెక్యూరిటితో కూడిన రిటర్న్స్ రావాలంటే పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు. పోస్టాఫీస్ దేశ ప్రజల కోసం ఎన్నో స్కీములను అమలు చేస్తోంది. ఈ స్కీములకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉంటుంది. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు అందిస్తుంది.

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో రోజుకు కేవలం రూ. 50పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం అందుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. మీకు అవసరం అయితే మరో ఐదేళ్లు కూడా పొడిగించుకోవచ్చు. ప్రతినెల కనీసం 100తో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇందులో గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఆదాయం వస్తుంది.

ఈ స్కీములో 6.7శాతం వడ్దీ అందిస్తున్నారు. 18ఏళ్లు నిండినవారు అవసరమైన పత్రాలు సమర్పించి పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. తల్లిదండ్రుల సంరక్షకుల సమక్షంలో మైనర్ల పేరుతో కూడా అకౌంట్ తీసుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ స్కీములో రోజు 50 రూపాయలు అంటే నెలకు 1500 పెట్టుబడి పెడితే..మీ పెట్టుబడి ఏడాదికి రూ. 18,000అవుతుంది. ఐదేళ్లు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీ పెట్టుబడి రూ. 90,000అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం రూ. 17,500 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ నాటికి పెట్టుబడి వడ్డీ కలుపుకుని 1,07,500వస్తుంది. మరో పదేళ్లు పొడిగిస్తే అప్పుడు మీ చేతికి రూ. 2,56,283 అవుతుంది.

Tags:    

Similar News