UPI, RuPay Transactions: ఇకపై యూపీఐ, రూపే టాన్సాక్షన్లపై బాదుడే బాదుడు
UPI, RuPay Transactions: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ అంటే యూపీఐ పేమెంట్స్ ఇటీవల కాలంలో ఎంతలా ప్రాచుర్యం పొందాయో తెలిసిందే. ఇది ఇండియన్ ఇన్ స్టంట్ పేమెంట్ సిస్టమ్.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI దీనిని అభివృద్ధి చేసింది.
UPI, RuPay Transactions: ఇకపై యూపీఐ, రూపే టాన్సాక్షన్లపై బాదుడే బాదుడు
UPI, RuPay Transactions: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ అంటే యూపీఐ పేమెంట్స్ ఇటీవల కాలంలో ఎంతలా ప్రాచుర్యం పొందాయో తెలిసిందే. ఇది ఇండియన్ ఇన్ స్టంట్ పేమెంట్ సిస్టమ్.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI దీనిని అభివృద్ధి చేసింది. ఇది డిజిటల్ పేమెంట్స్ లో సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పవచ్చు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో ఒక యాప్ ఉపయోగించి ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, వ్యాపారులకు వెంటనే డబ్బులు ట్రాన్ఫర్ చేయవచ్చు. రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య క్షణాల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఛాయ్ తాగి రూ.10ఇవ్వాలన్న.. షాపింగ్ కోసం వేలకు వేలు ఖర్చు చేసినా యూపీఐతోనే ఎక్కువగా చెల్లిస్తున్నారు. దీంతో జనాలు డబ్బులు పెట్టుకోవడమే మర్చిపోయారు.
అయితే ప్రస్తుతం ఈ యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ల కారణంగా వ్యాపారులపై ఎలాంటి ఛార్జీల భారం లేదు. అందుకే యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో చేసే చెల్లింపుల మీద మర్చంట్ ఛార్జీలను విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. భవిష్యత్ లో బడా వ్యాపారులు చేసే యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలను విధించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సదరు కథనాల్లో పేర్కొన్నాయి.వార్షికాదాయం రూ. 40 లక్షలకు మించి ఉండే వ్యాపారులకు యూపీఐ పేమెంట్ల పై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) తిరిగి తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ రంగం ప్రతినిధులు ఇటీవల కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు సమాచారం కేంద్రం కూడా దీనిపై సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రూ. 40 లక్షల్లోపు వార్షికాదాయం ఉండే వ్యాపారులు, యూపీఐ ట్రాన్సాక్షన్లను ఫ్రీగానే స్వీకరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ మర్చంట్ ఛార్టీలను తీసుకురావడం వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఇక్కడ ఈ చెల్లింపుల కోసం యూజర్ల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. మళ్లీ నగదు చలామణిలోకి వచ్చే అవకాశాలున్నట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల కిందటి వరకు యూపీఐ పేమెంట్స్‌కు వ్యాపారులు కొంత ఛార్జీలను బ్యాంకులకు కట్టాల్సి వచ్చేది. ఆ చెల్లింపులను ప్రాసెస్ చేయడం కోసం ఈ ఛార్జీలను చెల్లించేవారు. ఇది ఒక శాతం లోపే ఉండేది. యూపీఐ పేమెంట్లపై ఈ ఎండీఆర్ ఛార్జీలను కేంద్రం 2022లో తీసేసింది. మరోసారి ఆ ఛార్జీలను విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.