
Gold Rate Today: భగ్గుమన్న బంగారం ధరలు..90వేలు దాటిన తులం పసిడి
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈమధ్య అంతర్జాతీయంగా, దేశీయంగా కాస్త తగ్గిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మొదటిసారిగా రూ. 90వేలు దాటింది. కిలో వెండి ధర కూడా రూ. 1.03లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతోంది.
అమెరికాలనూ ఆర్థిక మందగమనం ఏర్పడుతుందనే ఆందోళనలు చుట్టుముడుతున్న పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారంపైకి పెట్టుబడులు మళ్లించడం, ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు కారణం అయ్యాయి. ఔన్సు మేలిమి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 2983 డాలర్లకు చేరుకుంది. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 90, 450కి చేరుకుంది. కిలో వెండి ధర రూ. 1,03,000 వద్ద కదలాడుతోంది.