Viral News: రూ.10లకు కొన్న షేర్లు.. 37ఏళ్ల తర్వాత చెత్తబుట్టలో దొరికిన పేపర్.. నేడు వాటి ధర కొన్ని లక్షలకు పైమాటే
Viral News: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరిని ఎప్పుడైనా అదృష్ట దేవత వరించవచ్చు. చండీగఢ్‌కు చెందిన రతన్ ధిల్లాన్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది.

Viral News: రూ.10లకు కొన్న షేర్లు.. 37ఏళ్ల తర్వాత చెత్తబుట్టలో దొరికిన పేపర్.. నేడు వాటి ధర కొన్ని లక్షలకు పైమాటే
Viral News: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరిని ఎప్పుడైనా అదృష్ట దేవత వరించవచ్చు. చండీగఢ్‌కు చెందిన రతన్ ధిల్లాన్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు తన పూర్వీకులకు సంబంధించిన చాలా స్పెషల్ విషయాన్ని అతడు కనుగొన్నాడు. దీంతో అది అతడి జీవితాన్నే మార్చేసింది. ఇది 1987 లో అతని తండ్రి, తాత కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) పాత షేర్లకు సంబంధించిన పేపర్ కనుగొన్నాడు. మొదట్లో అది పాత కాగితంలా అనిపించింది కానీ ఇప్పుడు దాని విలువ లక్షల్లో ఉంది.
ఆ సమయంలో రతన్ వద్ద ఉన్న షేర్ల విలువ కేవలం 300 రూపాయలు మాత్రమే.. కానీ నేడు వాటి విలువ 12 లక్షల రూపాయలకు పైగా ఉంది. అప్పట్లో రతన్ వద్ద ఉన్న షేర్లను రూ. 10 కి కొనుగోలు చేశారు. మొత్తం 30 షేర్లు ఉన్నాయి. ఆ సమయంలో వాటి మొత్తం విలువ రూ. 300. ఈ షేర్ల నిజమైన యజమాని ఈ ప్రపంచంలో లేడు కానీ వాటి వారసుడిగా రతన్ దాని ప్రయోజనాన్ని పొందబోతున్నాడు. రతన్ ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఈ షేర్లతో ఇప్పుడు ఏమి చేయాలో ప్రజల అభిప్రాయం అడగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రతన్ దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్‌లో ఉన్న నెటిజన్స్ అతనికి సలహా ఇవ్వడం ప్రారంభించారు. రిలయన్స్‌లో మూడు స్టాక్ విభజనలు, రెండు బోనస్‌ల తర్వాత హోల్డింగ్ 960 షేర్లకు పెరిగిందని ఒక వినియోగదారు రాశారు. ప్రస్తుత షేర్ల ధర ప్రకారం, నేడు వాటి అంచనా విలువ దాదాపు రూ. 12 లక్షలకు చేరుకుంది. ఓ సోదరా నువ్వు జాక్ పాట్ కొట్టావు. రీమ్యాట్ రూపంలో డీమ్యాట్ పొందండంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఐఇపిఎఫ్ఎ
అతని పోస్ట్‌పై ప్రభుత్వ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (IEPFA) కూడా స్పందిస్తూ.. మీరు వారి వాటాలను క్లెయిమ్ చేయకుండా ఒక నిర్దిష్ట కాలం పాటు కలిగి ఉంటే అవి IEPFకి బదిలీ చేయబడి ఉండేవని అన్నారు. ఇది జరిగిందో లేదో మీరు చెక్ చేయండి అని సూచించారు. దీని కోసం అథారిటీ సైట్‌లోకి లాగిన్ అయి చెక్ చేయాలన్నారు.